మందడం డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు.. పరిస్థితి ఉద్రిక్తం

08-01-2020 Wed 19:04
  • రహదారిని నిర్బంధించిన రైతులు 
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళలు
  • తుళ్లూరులోనూ ఉద్రిక్త వాతావరణం  

మందడం డీఎస్పీ కార్యాలయాన్ని రాజధాని  రైతులు ముట్టడించారు. రహదారిని దిగ్బంధించిన రైతులు నిరసనకు దిగారు. డీఎస్పీతో రైతులు, పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు నుంచి బస్సు యాత్రకు బయలుదేరిన రైతులను కృష్ణా కరకట్టపై పోలీసులు అడ్డుకున్నారు. ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. బస్సులను సీజ్ చేసి మందడం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.