అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రకు అడ్డంకి!

08-01-2020 Wed 17:54
  • ఈరోజు నుంచే ప్రారంభం కావాల్సిన బస్సుయాత్ర
  • 13 జిల్లాల బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసులు 
  • డీజీపీ అనుమతి తప్పనిసరి అంటున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ.. ఆందోళన బాట పట్టిన అమరావతి పరిరక్షణ జేఏసీ పోరాటంలో భాగంగా ఈరోజు బస్సుయాత్ర తలపెడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, పదమూడు జిల్లాల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్ర నిర్వహించాలంటే డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి తప్పనిసరని పోలీసులు చెబుతున్నారు.