విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

08-01-2020 Wed 17:04
  • జగన్ ని కలిసిన మంత్రి వెల్లంపల్లి, శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర
  • వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
  •  ఈ మేరకు ప్రకటన విడుదల

విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈరోజు జగన్ ని కలిశారు. శారదా పీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వెల్లంపల్లి ఓ ప్రకటన విడుదల చేశారు.