Amaravati: ఇక రైతుల బస్సు యాత్ర.. అమరావతి పరిరక్షణ జేఏసీ నిర్ణయం

  • 13 జిల్లాల్లో కొనసాగనున్న యాత్ర
  • హైకోర్టు వద్ద ఈ రోజే ప్రారంభం
  • విశాఖపట్టణం, కర్నూలు జిల్లాల గుండా సాగనున్న యాత్ర

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ.. ఆందోళన బాట పట్టిన అమరావతి పరిరక్షణ జేఏసీ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాలలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు, ఈ యాత్ర ఈ రోజే ప్రారంభంకానున్నట్లు జేఏసీ తెలిపింది. హైకోర్టు నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొంది.

బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్టణం, కర్నూలు జిల్లాల్లో కూడా రైతులు పర్యటించనుండటంతో అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పలు రాజకీయ పార్టీలతో కలిసి సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ)గా ఏర్పడి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు 21వ రోజుకు చేరాయి.

More Telugu News