ఫ్యాక్షనిజం కనిపించని కథ ఇది: 'సరిలేరు నీకెవ్వరు' గురించి అనిల్ రావిపూడి

08-01-2020 Wed 15:38
  • మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ 
  • బాధ్యత లేనివారిని ప్రశ్నించే ఆర్మీ ఆఫీసర్ 
  • కావాల్సినంత వినోదముందన్న అనిల్ రావిపూడి

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "దేశభక్తి .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ, కావాల్సినంత వినోదాన్ని కలుపుకుని సాగుతుంది.

మహేశ్ బాబు .. విజయశాంతి .. ప్రకాశ్ రాజ్ పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలను అర్పిస్తుంటే, సమాజంలోని వారు బాధ్యత లేకుండా వుంటారా? అని ప్రశ్నించే సినిమా ఇది. ఈ కథలో ఫ్యాక్షనిజం ఉందనే ప్రచారం జరిగింది .. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. మహేశ్ బాబు అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.