Rapist: మాంచెస్టర్ లోని పాశవిక రేపిస్ట్ కు 30 ఏళ్ల జైలు శిక్ష!

  • మాంచెస్టర్లో 195 మందిపై అత్యాచారాలు
  • 48 మంది యువకులపై పాల్పడ్డ నేరాలు నిరూపితం
  • మాటలతో ప్రలోభపెట్టి..డ్రగ్స్ ఇచ్చి రేప్

ప్రపంచంలోనే పాశావిక రేపిస్ట్ గా పేరుపొందిన ఇండోనేషియాకు చెందిన 36 ఏళ్ల రేన్హార్డ్ సినాగాకు మాంచెస్టర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కనీసం 30 ఏళ్లు ఉండాలని కోర్టు పేర్కొంది. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాయ్ బున్ సినాగా కుమారుడైన రేన్హార్డ్ బ్రిటన్ లో పీహెచ్ డీ చేస్తున్నాడు. మాంచెస్టర్ లో ఉన్న క్లబ్బుల వెలుపల 48 మంది యువకులపై 159 లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. అయితే.. రేన్హార్డ్ చేతిలో లైంగిక దాడులకు గురైన వారి సంఖ్య 195 మందికి పైగా ఉండవచ్చని మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియాలో అర్కెటెక్ట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత విద్యకు 2007లో యూకే వెళ్లిన రేన్హార్డ్ మాంచెస్టర్లో మంచి విలాసవంతమైన ఫ్లాట్ లో ఉంటున్నాడు.

అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం, రేన్హార్డ్ మంచి మాటకారి.. ఎదుటి వ్యక్తులను తన మాటలతో బోల్తా కొట్టించేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాంచెస్టర్ క్లబ్బుల్లో పలువురు యువకులను ఆకట్టుకొని తన ఫ్లాట్ కు తీసుకునిపోయి వారికి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారం జరిపేవాడని కోర్టులో నిరూపితమైంది. కోర్టులో అతని తరపు న్యాయవాది రేన్హార్డ్ తో ఇతరులు లైంగిక సంబంధాలను ఇష్ట పూర్వంకగా పెట్టుకునేవారన్నప్పటికీ.. జడ్జి ఆ వాదనను తిరస్కరించారు.

కాగా తన కుమారుడికి వేసిన శిక్షను అతని తండ్రి సాయ్ బున్ సినాగా  సమర్థించాడు. ‘మేము అతనికి విధించిన శిక్షను ఒప్పుకుంటున్నాం. అతను చేసిన నేరాలకు ఆ శిక్ష పడాల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఇంకా చర్చించదలుచుకోలేదు’ అని అని అన్నారు. 

More Telugu News