కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి

08-01-2020 Wed 14:33
  • సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారు
  • కేంద్రంలో మోదీ పాట, రాష్ట్రంలో ఒవైసీ పాట పాడుతున్నారని ఎద్దేవా
  • కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయొద్దు

కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయడం లేదని అన్నారు. ఈ రోజు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కేంద్రంలో మోదీ పాట, రాష్ట్రంలో ఒవైసీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయలేమని కేటీఆరే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.