మరి కొన్ని గంటల్లో ఎన్టీఆర్ చేతుల మీదుగా 'ఎంత మంచివాడవురా' ట్రైలర్

08-01-2020 Wed 14:12
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • బంధాలకు .. అనుబంధాలకు ప్రాధాన్యత
  • ప్రత్యేక ఆకర్షణగా గోపీసుందర్ సంగీతం

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ రోజు రాత్రి 7 గంటల 45 నిమిషాలకి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగనుంది. బహుశా ఈ వేదికపై నుంచి ఎన్టీఆర్ తో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయిస్తారని అనుకోవాలి. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలతో సాగే ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.