ఏడేళ్ల బాలికపై లైంగికదాడి: 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

08-01-2020 Wed 10:31
  • అఘాయిత్యానికి ఒడిగట్టింది 70 ఏళ్ల వృద్ధుడు 
  • ఒడిలో కూర్చోబెట్టుకుని లైంగిక దాడి 
  • తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు 

ఏడేళ్ల చిన్నారిపై డబ్బయ్యేళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్న నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎగుటూరు మాలకొండయ్య (70) 2018, ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ఏడేళ్ల బాలికను ఎత్తుకున్నాడు.

అనంతరం బాలికను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి విషయం గుర్తించారు. ఈలోగా బాలిక తల్లి వచ్చి జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో ఈ విధంగా తీర్పు చెప్పారు.