నేడు వైఎస్ జగన్ ఫుల్ బిజీ... షెడ్యూల్ ఇదే!

08-01-2020 Wed 08:48
  • కాసేపట్లో కలవనున్న పాక్ నుంచి విడుదలైన మత్య్సకారులు
  • 10.30 గంటలకు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష
  • ఆపై సీఆర్డీయే, విశాఖ మెట్రోలపై రివ్యూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఆయన షెడ్యూల్ ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఈ ఉదయం పాక్ నుంచి విడుదల అయిన రాష్ట్రానికి చెందిన మత్య్యకారులు జగన్ ను కలవనున్నారు. ఆపై ఉదయం 10.30 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో త్వరలో రానున్న ఎన్నికలు, ఉపాధి హామీ పథకం అమలు తీరు గురించి జగన్ అడిగి తెలుసుకోనున్నారు.

ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీయే అధికారులతో జగన్ మరో రివ్యూ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అమరావతి రైతుల నిరసనలు, రాజధానిని వికేంద్రీకరణ చేస్తే, అమరావతి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన విశ్లేషించనున్నారు. దాని తరువాత, సాయంత్రం 4.30 గంటలకు విశాఖ మెట్రోపై ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది.