రాయలసీమ జిల్లాల్లో ‘జనసేన’ ఇంఛార్జుల నియామకం

07-01-2020 Tue 20:29
  • పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం
  • రాజంపేట పార్లమెంటు స్థానానికి
  • అదే విధంగా.. 3 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు నియామకం

రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇంఛార్జుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాయలసీమలోని మూడు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు ఇంఛార్జులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. ఈ మేరకు ‘జనసేన’ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజంపేట పార్లమెంటు స్థానంతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఏడు, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.