రెజీనా ప్రధాన పాత్రధారిగా విభిన్న కథా చిత్రం

07-01-2020 Tue 16:47
  • మరో కథతో సెట్స్ పైకి కార్తీక్ రాజు 
  • ద్విభాషా చిత్రంగా నిర్మాణం 
  • నిర్మాతగా  రాజ్ శేఖర్ వర్మ

తెలుగు తెరపై ఎంతో మంది యువ దర్శకులు ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి యువ దర్శకుల జాబితాలో కార్తీక్ రాజు ఒకరుగా కనిపిస్తాడు. ఇంతకుముందు ఆయన 'నిను వీడని నీడను నేనే' సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొచ్చాడు. ఆయన దర్శకత్వం వహించిన ఆ సినిమా తెలుగుతోపాటు తమిళంలోను చెప్పుకోదగిన వసూళ్లనే రాబట్టింది.

దాంతో ఆయన మరో ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నాయిక ప్రాధాన్యతను కలిగిన కథను సిద్ధం చేసుకుని ఆయన రంగంలోకి దిగాడు. ప్రధానపాత్రకిగాను రెజీనాను ఎంపిక చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారు. రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా, వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతోంది. 'ఎవరు' తరువాత రెజీనా ప్రధాన పాత్రధారిగా రానున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి వుంది.