కుటుంబ సమస్యల వలన కొన్ని రోజులు కనిపించకుండాపోయాను: హీరోయిన్ అంజలి

07-01-2020 Tue 11:05
  • తొలి అవకాశం తమిళంలో వచ్చింది 
  • నాలుగు భాషల్లో కలిపి 46 సినిమాలు చేశాను 
  • టెన్షన్స్ వలన అప్పుడలా చేశానన్న అంజలి  

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "చెన్నైలో నేను డాన్సు క్లాసులకు వెళ్లి వస్తుంటే ఒక తమిళ సినిమా ప్రొడక్షన్ వాళ్లు నన్ను చూసి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అలా కథానాయికగా నా ప్రయాణం మొదలైంది.

కన్నడలో రెండు సినిమాలు .. మలయాళంలో రెండు సినిమాలు కలుపుకుని నాలుగు భాషల్లో 46 సినిమాలు చేశాను. తెలుగులో 'మసాలా' చేస్తున్నప్పుడు నేను ఎవరికీ కనిపించకుండాపోయాను. ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండటం కోసమే సెల్ కూడా ఆఫ్ చేసేశా. ఆ సమయంలో కుటుంబ సమస్యల కారణంగా నేను అలా చేయవలసి వచ్చింది. మానసికపరమైన ఒత్తిడిని తట్టుకోలేక ముంబై వెళ్లిన నేను, కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చేశాను" అని చెప్పుకొచ్చింది.