Kola: ఇదే కదా తల్లిపై ప్రేమ... కంటతడి పెట్టిస్తూ, వైరల్ అవుతున్న చిత్రం!

  • ఆస్ట్రేలియాను కమ్మేసిన కార్చిచ్చు
  • ఇప్పటికే 50 కోట్ల జంతువుల మృతి
  • గాయపడిన వాటికి చికిత్స
  • 'కోలా'కు చికిత్స చేస్తుంటే బిడ్డ ఉద్వేగం

కన్న తల్లిపై బిడ్డకుండే నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఈ చిత్రం. ఆస్ట్రేలియాలో గత సంవత్సరం నుంచి మొదలైన కార్చిచ్చు, ఇప్పటి వరకూ 50 కోట్ల జంతువులను బలితీసుకోగా, ఎన్నో కోట్ల జీవులు, మంటల ధాటికి గాయాల పాలయ్యాయి. లక్షల జంతువులను బతికించే ప్రయత్నాల్లో జంతు వైద్య నిపుణులు శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోయే ఇది కూడా.

చిన్న సైజు ఎలుగుబంటిలా కనిపించే శాకాహార జాతికి చెందిన ఈ ఆస్ట్రేలియా జీవి పేరు కోలా. మంటల్లో గాయపడగా, దీనికి వైద్యులు చికిత్స చేస్తున్న వేళ, దీని బిడ్డ, పరుగులు పెడుతూ వచ్చి, తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో డాక్టర్ ఈ చిత్రాన్ని తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. తల్లీబిడ్డల మధ్య ఉండే ప్రేమకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. చూపరులను భావోద్వేగానికి గురి చేసేలా ఉన్న ఈ ఫొటో వైరల్ అయిన తరువాత తల్లికి 'లిజీ' అని, బిడ్డకు 'ఫాంటమ్' అని నామకరణం చేశారు.

More Telugu News