అభిమానుల బుగ్గలు కొరుకుతూ... హడావిడి చేసిన యాంకరమ్మ!
- వైరల్ గా మారిన ‘పటాస్ షో‘ యాంకర్ వర్షిణి వీడియో
- హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గుండ్రంగా తిప్పిన యాంకర్
- విమర్శలతో విరుచుకుపడుతున్న నెటిజన్లు
వర్షిణి దూకుడు అంతటితో ఆగిపోలేదు. హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గుండ్రంగా తిప్పిసేంది. దీంతో వర్షిణిపై నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. యాంకర్ల ప్రవర్తనకు కూడా ఓ హద్దుంటుందని మండిపడుతున్నారు. పటాస్ షో నుంచి శ్రీ ముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. తనకంటూ గుర్తింపు పొందడానికి ఏదో వెరైటీ చేయాలని ఈ విధంగా చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇకముందు ఇంకా ఎలాంటి వెరైటీలతో ఆకట్టుకుంటుందో చూడాలంటూ.. కామెంట్లు పెట్టేవారు కూడా ఉన్నారు.