Amaravati: అమరావతి నుంచి రాజధానిని తరలించట్లేదు, పాలనను వికేంద్రీకరిస్తున్నారు: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • ప్రాంతాల మధ్య హక్కుల కోసం పోరాటం జరిగితే తప్పేంటి?
  • ఉత్తరాంధ్రను రాజధానిగా చేయాలనడం హర్షణీయం
  • మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరగాలి
అమరావతి నుంచి రాజధానిని తరలించ వద్దంటూ అక్కడి రైతులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించట్లేదని, పాలనను మాత్రమే వికేంద్రీకరిస్తున్నారని అన్నారు. మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ప్రాంతాల మధ్య హక్కుల కోసం పోరాటం జరిగితే తప్పేంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తున్నామని, రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
Amaravati
Capital
BJP
MP
TG
Venkatesh

More Telugu News