Chandrababu: మూడు రాజధానులు ఏంటయ్యా? అని విద్యార్థులను ఎగతాళి చేస్తారు: చంద్రబాబు

  • మూడు రాజధానుల పేర్లు చెప్పడానికి విద్యార్థులు సిగ్గుపడతారు
  • ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయవచ్చని డీజీపీ అన్నారు
  • మరి అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అరెస్టులు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ... 'నేను ఇటీవల అమరావతిలో పర్యటించడానికి వస్తే బస్సుపై కర్రలతో, చెప్పులతో దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయవచ్చని  డీజీపీ అన్నారు. మరి అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు' అని విమర్శించారు.

'యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని ఉండాలి. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తే మీ రాజధాని ఏదని వారిని అడిగితే మూడు రాజధానుల పేర్లు చెప్పడానికి సిగ్గుపడతారు. ఒకవేళ విద్యార్థులు తమ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయని చెబితే.. మూడు రాజధానులు ఏంటయ్యా? అని వారిని ఎగతాళి చేస్తారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదనే అమరావతికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని గురించి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.

More Telugu News