Amaravati: 10 వేల మందితో అమరావతి రైతుల మహా పాదయాత్ర

  • 20వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
  • తుళ్లూరు నుంచి మందడం వరకు మహా పాదయాత్ర
  • పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరన్న నిరసనకారులు

అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం తుళ్లూరు నుంచి మందడం వరకు మహా పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో 10 వేల మంది రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టులు ప్రభుత్వ జిరాక్స్ కాపీలేనని విమర్శించారు. హైపర్ కమిటీ నివేదిక కూడా మరో కలర్ జిరాక్స్ తప్ప మరొకటి కాదని అన్నారు. తమ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News