Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే.. ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ: వైవీ సుబ్బారెడ్డి

  • ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లోనే వైకుంఠ ద్వార దర్శనం
  • గతంలో మాదిరి రెండు రోజులే దర్శనం ఉంటుంది
  • హైకోర్టు సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకున్నాం 

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, గతంలో మాదిరి రెండు రోజులు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టు సూచనల మేరకు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.  

More Telugu News