Anil Ravipudi: ముందే వచ్చిన సంక్రాంతి... పండంటి బాబుకు జన్మనిచ్చిన అనిల్ రావిపూడి భార్య!

  • ఈ ఉదయం బిడ్డకు జన్మనిచ్చిన భావన
  • అభినందనలు తెలిపిన మహేశ్ బాబు
  • ఆశీర్వదించిన సినీ ప్రముఖులు

గత సంక్రాంతికి 'ఎఫ్-2' చిత్రంతో సూపర్ హిట్ కొట్టి, ఈ సంక్రాంతికి మహేశ్ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు'తో మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించనున్న అనిల్ రావిపూడి ఇంట్లో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. ఆయన భార్య భావని, ఈ ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇప్పటికే శ్రేయాస్వి అనే కుమార్తె ఉందన్న సంగతి తెలిసిందే.

ఇక అనిల్ రావిపూడికి బాబు పుట్టాడన్న వార్తను తెలుసుకున్న మహేశ్ బాబు, అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, అనిల్ దంపతులు ఇప్పుడు చాలా గర్వపడుతుంటారని అన్నారు. వారి కుటుంబంపై దేవుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అనిల్ దంపతులను ఆశీర్వదించారు. 

More Telugu News