మీడియాను పిలిచిన కృష్ణంరాజు, మురళీమోహన్... రాజశేఖర్ పై కఠిన చర్యలు!

05-01-2020 Sun 10:41
  • డైరీ ఆవిష్కరణలో రసాభాస
  • రాజశేఖర్ పై చర్యలకు మెగాస్టార్ డిమాండ్
  • ఈ మధ్యాహ్నం తమ నిర్ణయాన్ని తెలపనున్న 'మా'
ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సీనియర్ నటులు కృష్ణంరాజు, మురళీ మోహన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానాన్ని వారు మీడియా సంస్థలకు పంపారు. మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేశ్ కూడా ఇందులో పాల్గొంటారని తెలిపారు.

ఇటీవల మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన రభసపై వీరు స్పందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'మా' ఉపాధ్యక్షుడి హోదాలో హీరో రాజశేఖర్ చేసిన గొడవపై, క్రమశిక్షణా సంఘం తరఫున తీసుకున్న చర్యలను వీరు వివరిస్తారని సమాచారం.

రాజశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు తదితరులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటుల మీడియా సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.