Raviteja: 'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

  • రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం 
  • సందడి చేయనున్న ముగ్గురు భామలు 

రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి వేదిక ఎక్కడనే విషయంతో పాటు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

రవితేజ సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముగ్గురు భామలతో తెరపై రవితేజ చేసే సందడి కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News