Rakul Preeth Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఆ తర్వాత ఇక ఆలోచించనంటున్న రకుల్!
  • హిందీలోకి హిట్ చిత్రం 'వెంకీ మామ'
  • సీనియర్ నిర్మాత దర్శకత్వంలో సినిమా

*  ఒక సినిమా ఒప్పుకునే ముందు ఎక్కువగా ఏమీ ఆలోచించనని చెబుతోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'సినిమాకి ముందు ఏ దర్శకుడు చెప్పినా ఆ కథ చాలా బాగుందనిపిస్తుంది. అయితే, ఆఖరికి సినిమాగా రూపొందాక అది ఎలా వస్తుందనేది మనం ఊహించలేం. అందుకే కథ వినేటప్పుడు నాకు సూపర్ గా అనిపిస్తే ఒప్పేసుకుంటాను. ఆ తర్వాత దాని ఫలితం గురించి ఇక ఆలోచించను' అని చెప్పింది రకుల్.  
*  బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన 'వెంకీ మామ' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంతో నిర్మాత సురేశ్ బాబును సంప్రదిస్తున్నారట.
*  పలు హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పేరు 'డర్టీ హరి'. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ ఈ రోజు ప్రకటిస్తామని ఎమ్మెస్ రాజు తెలిపారు.

More Telugu News