Darbar: హైదరాబాద్‌లో ఘనంగా ‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక.. ఆ కోరిక 15 ఏళ్లకు తీరిందన్న రజనీకాంత్

  • సంక్రాంతి కానుకగా 9న విడుదల కాబోతున్న ‘దర్బార్’
  • డైరెక్టర్ మురుగదాస్‌పై ప్రశంసలు
  • ఆదిత్య అరుణాచలం పాత్రలో సూపర్‌స్టార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దర్బార్’. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 9న తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. మురుగదాస్‌తో పనిచేయాలని 15 ఏళ్ల నుంచి అనుకుంటుంటే, అది ఇప్పుడు నెరవేరిందని అన్నారు. ఈ సినిమాలో తాను ఆదిత్య అరుణాచలం అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించినట్టు తెలిపారు. ఈ కథను వింటే హీరో, నిర్మాత ఈ చిత్రాన్ని ఎలా చేశారా? అని ఆశ్చర్యపోతారని, అయితే, మురుగదాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లేను అందించారని రజనీకాంత్ ప్రశంసించారు. తాను 168 సినిమాలు చేశానని, ఇది మాత్రం వాటికి భిన్నమైన సినిమా అని పేర్కొన్నారు.

More Telugu News