హైదరాబాద్ లో ఆపిల్ సంస్థ ఉద్యోగిని అదృశ్యం
- రోహిత మిస్సయి నేటికీ.. తొమ్మిది రోజులు
- డిసెంబర్ 26న ఆటో ఎక్కుతున్నట్లుగా సీసీటీవీలో రికార్డింగ్
- ఆచూకీ తెలుసుకోవడంలో రెండు పోలీసుల బృందాలు
రోహిత డిసెంబర్ 26న మధ్యాహ్నం 3.15 గంటలకు గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆటో ఎక్కుతున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. తన ఫోన్ ను ఆమె ఇంట్లోనే మరిచిపోవడంతో ఆచూకీ తెలుసుకోవడం సమస్యగా మారిందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు రోహిత కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు బృందాలు పనిచేస్తున్నాయి.