Warangal Rural District: అర్ధరాత్రి టిప్పర్ ఢీకొని 250 గొర్రెలు మృతి

  • వరంగల్ రూరల్ జిల్లా పాకాల సమీపంలో ఘటన
  • అర్ధరాత్రి ఇంటికి తోలుకు వస్తున్న సమయంలో ఢీకొట్టిన టిప్పర్
  • రూ. 18 లక్షల నష్టం

అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను ఓ టిప్పర్ ఢీకొన్న ఘటనలో 250 మూగ జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. వరంగల్ రూరల్ జిల్లా, ఖానాపురం మండలంలోని పాకాల వాగుపై జరిగిందీ ఘటన.  ఈ ఘటనలో రూ. 18 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు గొర్రెల యజమాని తెలిపాడు.

పాకాల-వాజేడు అటవీ ప్రాంతంలో తన 600 గొర్రెలను మేపుకుని ఇంటికి వస్తుండగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ గొర్రెలను ఢీకొట్టినట్టు తెలిపాడు. ఈ ఘటనలో 250 గొర్రెలు మృతి చెందాయని వాపోయాడు. టిప్పర్ టైర్ల మధ్య గొర్రెల కళేబరాలు ఇరుక్కుపోవడంతో వాహనం కదల్లేకపోయింది. దీంతో దానిని అక్కడే వదిలేసిన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

More Telugu News