విశాఖలో దారుణం.. ఆస్తి తగాదాలతో భార్యను కొట్టి చంపిన భర్త
- భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు
- రోకలిబండతో కొట్టి చంపిన భర్త
- పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
భార్యపై అనుమానంతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో భర్త శోభన్‌రాజ్ తరచూ భార్యను వేధించేవాడు. మంగళవారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని చర్చికి వెళ్లి బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి ఇంటికొచ్చారు. నాలుగు గంటల సమయంలో భార్యతో మరోమారు గొడవకు దిగిన భర్త ఆగ్రహం పట్టలేక రోకలిబండతో తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుమారుడు, ఇరుగుపొరుగు వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.