సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

02-01-2020 Thu 07:22
  • నిత్యా మీనన్ మళ్లీ వస్తోంది 
  • ఆర్పీ దర్శకత్వంలో 'అలీషా'
  • వచ్చే నెలలో నందు 'సవారి'

  *  కొత్త హీరోయిన్ల దూకుడుతో టాలీవుడ్ లో వెనుకపడిపోయిన కథానాయిక నిత్యామీనన్ తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని ఒప్పుకుంది. 'స్కైలాబ్' పేరుతో నూతన దర్శకుడు విశ్వక్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటిస్తారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో 'అలీషా' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆర్పీనే అందిస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్రలను నూతన నటీనటులు పోషిస్తున్నారు.
*  యంగ్ హీరో నందు కథానాయకుడుగా రూపొందిన సవారి చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న రిలీజ్ చేస్తారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్రలో నటించింది.