చంద్రబాబుకు ఎందుకంత తొందర? ఇన్ సైడర్ ట్రేడింగ్ పై త్వరలోనే చర్యలు తీసుకుంటాం: ఏపీ స్పీకర్ తమ్మినేని

01-01-2020 Wed 20:47
  • రాజధాని ఏర్పాటు అంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయడం కాదు
  • టీడీపీ ఒక ప్రతిపక్షం..ఆయన ఒక నాయకుడు
  • విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని చంద్రబాబు సమర్థిస్తారా? లేదా?

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని.. చంద్రబాబుకు ఎందుకంత తొందర? అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటు చేయడమంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయడం కాదని విమర్శించారు. 'టీడీపీ ఒక ప్రతిపక్షం, ఆయన ఒక నాయకుడు' అంటూ చంద్రబాబుపై కామెంట్ చేశారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చంద్రబాబు సమర్థిస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఏర్పడి అభివృద్ధి చెందుతుంటే, అప్పుడు దాని విలువ వారికి తెలుస్తుందని అన్నారు.