Sensex: కొత్త సంవత్సరాన్ని పాజిటివ్ గా ప్రారంభించిన మార్కెట్లు

  • 52 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 14 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • లాభపడ్డి ఇన్ఫ్రా, ఐటీ, ఎనర్జీ సూచీలు

నూతన సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభించాయి. ఇన్ఫ్రా, ఐటీ, ఎనర్జీ, కన్జ్యూమర్ గూడ్స్ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించినప్పటికీ... ఆటోమొబైల్స్, కొన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాలను హరించివేశాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 41,306కి చేరుకుంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 12,182 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.76%), ఎన్టీపీసీ (2.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.97%), ఎల్ అండ్ టీ (0.86%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.84%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.72%), బజాజ్ ఆటో (-1.21%), ఓఎన్జీసీ (-1.05%), టాటా స్టీల్ (-0.90%).

More Telugu News