పవన్ కల్యాణ్ పై పోలీస్ కేసు వదంతులను నమ్మొద్దు: గుంటూరు రూరల్ ఎస్పీ

01-01-2020 Wed 16:30
  • పవన్ పై కేసు నమోదంటూ వదంతులు
  • ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై చర్యలు తప్పవు
  • ఓ ప్రకటనలో గుంటూరు రూరల్ ఎస్పీ

నిన్న రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేస్తారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్పీ ఖండించారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల విధులకు పవన్ ఆటంకం కల్గించారని, పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి.