సంగారెడ్డి జిల్లాలో.. సంపూర్ణ మద్య నిషేధంపై గ్రామస్థుల తీర్మానం
- సమావేశంలో పాల్గొన్న మండల పీఎస్ ఎస్ఐ
- బెల్టు షాపులు తొలగించాలంటూ ఎస్ఐ కాళ్లపై బడ్డ వృద్ధురాలు
- మద్యంతో కుటుంబాలు చితికిపోతున్నాయన్న గ్రామస్థులు
ఈ సందర్భంగా పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన కుర్రి నర్సమ్మ అనే వృద్ధురాలు తమ గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని ఎస్ఐ కాళ్లు పట్టుకుని కోరడం అందరినీ కదిలించింది. తన కుమారుడు నిత్యం తాగొచ్చి కొడుతున్నాడని ఆ వృద్ధురాలు వాపోయింది. గ్రామస్థులనుద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ..మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలను వివరించారు.