bipin ravat: రాజకీయాలకు మేము దూరంగా ఉంటాం: త్రిదళాధిపతి బిపిన్ రావత్

  • ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు ఒక జట్టుగా పనిచేస్తాయి
  • అన్ని విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరం 
  • కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చేసే సూచనల మేరకు పనిచేస్తాం

ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు ఒక జట్టుగా పనిచేస్తాయని దేశ తొలి త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే, వాయు సేన అధిపతి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్ తో పాటు పలువురు సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడుతూ... అన్ని విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. ఆర్మీ, వాయుసేన, నౌకాదళంలో రాజకీయాల జోక్యంపై ఆయన స్పందిస్తూ...  రాజకీయాల నుంచి తాము చాలా దూరంగా ఉంటామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చేసే సూచనల మేరకు పనిచేస్తామని తెలిపారు.

More Telugu News