Tiger: పడుకున్న పులిని ఒంటరి సింహం కవ్విస్తే... వీడియో ఇదిగో!

  • రెండు పంజాలతో దాడి చేసే పులి
  • పులి సత్తాను వెంటనే తెలుసుకున్న సింహం
  • వెంటనే పలాయనం

ఓ పెద్దపులి పడుకుని ఉంది. నెమ్మదిగా దాని దగ్గరకు వచ్చిన ఓ సింహం, కవ్విస్తూ దాడికి దిగింది. అప్పుడు ఏం జరిగింది? ఈ వీడియో చూస్తే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా, ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ తీశారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

వాస్తవానికి పెద్దపులి రెండు పంజాలతో దాడి చేస్తుంది. సింహం ఒక పంజాతోనే దాడి చేస్తుంది. ఈ రెండింటి మధ్యా పోరు జరిగితే... పెద్దపులి సత్తాను సింహం వెంటనే పసిగట్టి, అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. పెద్దపులి పంజా దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే, అది ఒక్క వేటుతో ఓ ఆవు పుర్రె ఎముకను పగలగొట్టగలిగేంత. ఇదే విషయాన్ని తెలుపుతూ సుశాంత్ నందా వీడియోను ప్రజల ముందుంచారు. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

More Telugu News