Naga Shaurya: 'అశ్వత్థామ' కోసం డబ్బింగ్ చెబుతున్న నాగశౌర్య

  • 'అశ్వత్థామ'గా నాగశౌర్య 
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల 
  • వచ్చేనెల 31వ తేదీన విడుదల 

ఇప్పటివరకూ లవర్ బాయ్ ఇమేజ్ తో అదే తరహా చిత్రాలను నాగశౌర్య చేస్తూ వచ్చాడు. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన యాక్షన్ సినిమా చేశాడు. 'అశ్వత్థామ' టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. పవర్ఫుల్ టైటిల్ .. అందుకు తగిన పవర్ఫుల్ రోల్లో నాగశౌర్య కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.

ప్రస్తుతం నాగశౌర్య తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. జనవరి 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొత్త ఏడాదిలో నాగశౌర్యను హిట్ పలకరిస్తుందేమో చూడాలి.

More Telugu News