స్మార్ట్ ఫోన్ యూజర్లకు వివో షాక్... తగ్గింపు ధరలకు ఆన్ లైన్ అమ్మకాలు నిలిపివేత!
- రూరల్ మార్కెట్ పై కన్నేసిన వివో
- ఆఫ్ లైన్ అమ్మకాలు పెంచుకునే యత్నం
- జనవరి తొలి వారంలో కొత్త ఫోన్ లాంచ్
కాగా, ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థల్లో ఒకటైన వివో, ఆఫ్ లైన్ మార్కెట్ పై, ముఖ్యంగా రూరల్ మార్కెట్ పై దృష్టిని సారించాలని నిర్ణయించుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివో తాజా నిర్ణయాన్ని ఐమ్రా (ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్) స్వాగతించింది.
ఇదిలావుండగా, జనవరి తొలివారంలో ఎస్ 1 ప్రో పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను వివో ఆవిష్కరించనుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్, 6.38 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 665 సాక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 48 ఎంపీ క్వాడ్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. దీని ధరపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.