ఏం అధ్యయనం చేసి ఆంగ్ల మీడియం నిర్ణయం తీసుకున్నారు?: జొన్నవిత్తుల
- ఏపీలో ఇంగ్లీషు మీడియం
- స్పందించిన జొన్నవిత్తుల
- ప్రభుత్వానికే నష్టం అంటూ వ్యాఖ్యలు
మనది అద్భుతమైన భాషా కేంద్రం అని, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. ప్రభుత్వ చర్యలు తప్పు కాబట్టే రచయితలుగా, పౌరులుగా, గళం విప్పుతున్నామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం చాలా నష్టపోతుందని జొన్నవిత్తుల హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఇంగ్లీషు మీడియం అంశంలో పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు.