Andhra Pradesh: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్

  • శాంతిభద్రతలపై స్పందించిన డీజీపీ
  • 2020ని మహిళా భద్రతా సంవత్సరంగా పేర్కొన్న సవాంగ్
  • అమరావతిలో సంయమనంతో వ్యవహరించామని వెల్లడి
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై స్పందించారు. గత సంవత్సరంతో పోల్చితే రాష్ట్రంలో 6 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు. ఎక్కువ మంది సైబర్ మిత్ర యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. మనుషుల అక్రమరవాణాకు పాల్పడుతున్న 609 మందిని అరెస్ట్ చేశామని సవాంగ్ వివరించారు. 2020 సంవత్సరాన్ని మహిళా భద్రత సంవత్సరంగా చూడబోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, అమరావతి గ్రామాల్లో ఎంతో సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. కొందరు కావాలనే రెచ్చగొడుతున్నట్టుగా ఉందని డీజీపీ వెల్లడించారు. నిరసనలు ప్రశాంతంగా ఉంటే తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
Andhra Pradesh
DGP
Gautam Sawang
Amaravathi
Cybermitra

More Telugu News