Virat Kohli: స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వతాల్లో కోహ్లీ, అనుష్క విహారం

  • ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ తో సిరీస్
  • స్విస్ మంచు పర్వతాల్లో కోహ్లీ, అనుష్క పర్యటన
  • రెండేళ్ల వైవాహిక జీవితం పూర్తిచేసుకున్న కోహ్లీ, అనుష్క
ఇటీవలే వెస్టిండీస్ తో సిరీస్ ముగియడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అర్ధాంగి అనుష్కతో విహారయాత్రకు వెళ్లాడు. వెస్టిండీస్ తో సిరీస్ కు ముందు భూటాన్ లో జంటగా ఎంజాయ్ చేసిన కోహ్లీ, అనుష్క ఇప్పుడు స్విట్జర్లాండ్ లో తేలారు. అక్కడి ఆల్ప్స్ పర్వతాల ప్రకృతి రమణీయతను హాయిగా ఆస్వాదిస్తున్నారు. తమ పెళ్లయి రెండేళ్లు కావడంతో ఆ మధురక్షణాలను స్విస్ మంచు పర్వతాల సాక్షిగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను కోహ్లీ షేర్ చేయడంతో అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు.
Virat Kohli
Anushka Sharma
Swiss
Alps
Tour
Cricket

More Telugu News