Amaravathi: రాజధాని రైతులకు చంద్రబాబు చేయని పనులు సీఎం జగన్ చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

షార్ట్స్‌లో చూడండి
రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో దోపిడీయే లక్ష్యంగా పని చేశారని, అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.

అలాంటి చంద్రబాబు ఈరోజున రైతుల గురించి మాట్లాడటం దారుణమని విమర్శించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక, రాజధానిపై సీఎం ఆలోచన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయని పనులు సీఎం జగన్ చేస్తున్నారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బు ఇస్తోందని, రైతు కూలీలకు ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Amaravathi
Jagan
Telugudesam
Chandrababu

More Telugu News