waightlifting: వెయిట్ లిఫ్టర్ సీమాపై వేటు : నాలుగేళ్లు ని షేధం విధించిన నాడా

  • నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ 
  • ఈ ఏడాది విశాఖలో జరిగిన పోటీల్లో వినియోగం 
  • రెండేళ్ల క్రితం కామన్వెల్త్ పోటీల్లో సీమాకు రజతం

భారత్ వెయిట్ లిఫ్టర్ సీమాపై వేటు పడింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్థారించిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్లపాటు ఆమెపై నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం 2017 కామన్వెల్త్ చాంపియన్ షిప్ పోటీల్లో 75 కేజీల విభాగంలో సీమా రజత పతకం గెల్చుకుని క్రీడాభిమానులను ఆకర్షించింది. 2018లో జరిగిన గోల్డ్ కోస్టు కామన్వెల్త్ గేమ్స్ లో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది విశాఖలో జరిగిన జాతీయ మహిళా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు నాడా గుర్తించింది.

దీంతో నాడాకు చెందిన 'యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్' ఆమె పై వేటు వేసింది. 'సీమా రక్తనమూనాల్లో నిషేధిత మెటబొలైట్ ఆఫ్ టామోక్సి ఫెస్, ఎస్ఈఆర్ఎం మెటొనోలెన్, ఎనొబోస్రమ్, ఎస్ఎఆర్ఎం పదార్థాలు ఉన్నాయి' అని తేల్చింది.

More Telugu News