Shreyas Ayyar: చెప్పకుండా మ్యాచ్ ఎగ్గొట్టిన శ్రేయాస్ అయ్యర్, దూబే... ఘోర ఓటమి తరువాత ఎంసీఏ చర్యలు!

  • రైల్వేతో రంజీ మ్యాచ్ ఆడిన ముంబయి
  • 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి
  • మ్యాచ్ ఆడని క్రికెటర్లపై చర్యలు

చెప్పా పెట్టకుండా ఆటను ఎగ్గొట్టారని, ఆ కారణంగానే తాము ఘోరంగా ఓడిపోయామని భావిస్తున్న ఎంసీఏ (ముంబై క్రికెట్ అసోసియేషన్) యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబేలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో వీరిద్దరితో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా ఆడారన్న సంగతి తెలిసిందే. రైల్వేస్ తో జరిగిన రంజీ పోటీలో ముగ్గురూ ఆడాల్సివుంది. అయితే, శార్దూల్ మినహా మిగతా ఇద్దరూ ఆడలేదు. వీరు అనుమతి లేకుండానే విశ్రాంతి పేరిట డుమ్మా కొట్టారు.

ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఎవరి సూచనలతో విశ్రాంతి తీసుకున్నారని ప్రశ్నించగా, సెలక్టర్లు చెప్పారని ఇద్దరి నుంచి సమాధానం వచ్చిందట. అయితే, తమకు మాత్రం బీసీసీఐ నుంచిగానీ, సెలక్టర్ల నుంచి గానీ, ఫిజియో నుంచి గానీ, ఆటగాళ్లకు విశ్రాంతిపై సమాచారం లేదని ఎంసీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వారి సొంత నిర్ణయంతో బోర్డు పరువు పోయిందని అంటున్నారు. ఈ చర్యలను సహించేది లేదని, త్వరలో జరిగే ఎంసీఏ బ్యారర్ల సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News