ప్రశాంత్ కిశోర్ ఎవరు?.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
- ఆయనెవరో నాకు తెలియదు
- అప్పట్లో నేను బీజేపీలో లేను
- స్పష్టం చేసిన మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి
‘ప్రశాంత్ కిశోర్ ఎవరు? ఆయనను నేనెప్పుడూ చూడలేదు’ అని మంత్రి పేర్కొన్నారు. ‘ఆయనెవరో మీకు తెలియదా? 2014 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేశారుగా, గుర్తుకు తెచ్చుకోండి’ అని మీడియా ప్రతినిధులు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన సమాధానంగా.. అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. దీంతో విస్తుపోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.