Andhra Pradesh: రాజధాని మహిళల్లో ఎవరిని కదిలించినా కన్నీటి ప్రవాహమే!

  • తీవ్రరూపు దాల్చుతున్న రాజధాని మార్పు అంశం
  • అమరావతిలో నేడు కూడా ధర్నాలు, నిరసనలు
  • కన్నీటి పర్యంతమవుతున్న మహిళలు

ఏపీ ప్రభుత్వం రాజధాని మార్చుతోందంటూ అమరావతి ప్రాంతంలో రైతులు, వారి కుటుంబసభ్యులు చేపడుతోన్న ఆందోళనలు నానాటికీ హెచ్చుతున్నాయి. ఇప్పుడక్కడి మహిళలు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీరే సమాధానమవుతోంది.

 తమ పిల్లలకు బంగారు భవిష్యత్ లభిస్తుందన్న భరోసాతో భూములు ఇచ్చామని, ఇప్పుడు అమరావతి రాజధాని కాదంటే తట్టుకునేదెట్లా? అని రైతుల కుటుంబాల్లోని మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే తమ పరిస్థితి ఏంటని వారు భోరుమంటున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని విలపించారు. సీఎం జగన్ రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని, రాజధాని తరలింపు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News