రాజధానిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ
- రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరంలేదు
- భూముల కొనుగోలులో అక్రమాలు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశంలో చేపట్టే అభివృద్ధిపై ప్రకటన చేయాలి
రాజధాని సమస్య అనేది కేవలం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల సమస్య కాదన్నారు. అక్కడ ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. అక్కడ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరంలేదని అభిప్రాయపడ్డారు. రాజధానిపై మంత్రులు చెబుతున్న వ్యాఖ్యలు సబబుగా లేవన్నారు. అక్రమాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.