CPI leader Ramakrishna coments on cpaital city: రాజధానిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ

  • రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరంలేదు
  • భూముల కొనుగోలులో అక్రమాలు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశంలో చేపట్టే అభివృద్ధిపై ప్రకటన చేయాలి

ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టత ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత రైతులు నిరసనలు తీవ్రం చేశారన్నారు.  వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందో ప్రకటించాలన్నారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయసాయిరెడ్డి.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అని ప్రకటించారు. మరోపక్క ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’ అన్నారు.

రాజధాని సమస్య అనేది కేవలం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల సమస్య కాదన్నారు. అక్కడ ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. అక్కడ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరంలేదని అభిప్రాయపడ్డారు. రాజధానిపై మంత్రులు చెబుతున్న వ్యాఖ్యలు సబబుగా లేవన్నారు. అక్రమాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News