Venkatesh: 'వెంకీమామ' పదిరోజుల వసూళ్లు

  • ఈ నెల 13న వచ్చిన 'వెంకీమామ'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకి పైగా షేర్

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ', ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పది రోజులకుగాను 23.27 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 27.64 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 9.35 కోట్లను వసూలు చేయడం విశేషం. వెంకటేశ్ - చైతూ నిజ జీవితంలో మేనమామ - మేనల్లుడు కావడం, అదే అనుబంధంతో వాళ్లు తెరపై కనిపించడం ఈ సినిమాకి ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. వెంకటేశ్ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా చేసిన సందడి ప్రేక్షకులను అలరించింది. పెద్దగా పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడంతో, ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూనే వుంది.

More Telugu News