ఐదు నెలల తర్వాత కార్గిల్ లో పున:ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ పై నిషేధం
- సాధారణ స్థితికి వచ్చిన శాంతిభద్రతలు
- ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన ప్రజలు
ఆ తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. లడఖ్ లో కార్గిల్ ఉన్న విషయం తెలిసిందే. శాంతిభద్రతలు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో, ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలని గత కొంత కాలంగా కార్గిల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ సేవలను పున:ప్రారంభించారు. మరోవైపు, ఇంటర్నెట్ ను జాగ్రత్తగా వాడాలని ప్రజలకు స్థానిక నేతలు సూచించారు.