Disha: 'దిశ' నిందితుడి తండ్రిని ఢీకొన్న పోలీసు వాహనం!

  • ఎన్ కౌంటర్ లో మరణించిన చెన్నకేశవులు
  • చెన్నకేశవులు తండ్రి కూర్మయ్యను ఢీకొన్న సైబరాబాద్ ఏసీపీ వాహనం
  • నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు

దిశ కేసు నిందితుడు, పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన చెన్నకేశవులు తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సైబరాబాద్ ఏసీపీ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో జరిగింది. చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప తన స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం తరువాత సదరు పోలీసు అధికారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారన్న సెక్షన్ పై కేసు నమోదు చేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News