మౌన దీక్షను చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ

  • ఉద్ధండరాయునిపాలెంలో దీక్ష చేపట్టిన కన్నా
  • పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి దీక్ష ప్రారంభం
  • రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్షను చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఆయన... ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షకు దిగారు. అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో దీక్ష చేపట్టారు. పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి ఆయన దీక్షను ప్రారంభించారు. ఆయనకు సంఘీభావంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు దీక్షకు దిగారు. గంటసేపు ఈ దీక్ష కొనసాగనుంది.
Go Back to Shorts
Kanna
BJP

More Telugu News